మానవత్వం : పోలీస్ అధికారి పేరు పెట్టుకున్న మాతృమూర్తి..ఎందుకో తెలుసా

కరోనా మహమ్మారి..తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. మానవాళికి పెను ప్రమాదంగా మారిపోయింది. మరోవైపు మానవ సంబంధాలను గుర్తుకు చేస్తోంది. దగ్గరకు చేరుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. పోలీసులు, వైద్యులు, ఇతర సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో మనస్సులను కదిలించే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
మానవత్వం, కృతజ్ఞత, కుల, మత బేధాలేవీ అడ్డురావని ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నేను గర్భిణీ..పురిటినొప్పులు వస్తున్నాయి..నా భర్తను నా దగ్గరకు చేర్చండి’ అంటూ ఓ మహిళ వేడుకోలుకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే స్పందించిన ఆ అధికారి..భర్తను ఆమె దగ్గరకు చేర్చారు. కృతజ్ఞతగా తన బిడ్డకు పోలీసు అధికారి పెట్టుకుని కృతజ్ఞత చాటుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బరేలీలో తమన్నా ఖాన్ మహిళ నివాసం ఉంటోంది. ఈమె నిండు గర్భిణీ. ప్రసవానికి సమయం దగ్గర పడింది. ఈ సమయంలో తన దగ్గర ఉండాల్సిన భర్త..అనీజ్ ఖాన్ లాక్ డౌన్ కారణంగా నోయిడాలో ఉండిపోయాడు. తీవ్రంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తన కష్టాన్ని, మనోవేదనను బరేలీ పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేసింది.
ఓ వీడియో మేసేజ్ పంపారు. నొయిడా ఏడీసీపీ రణ్ విజయ్ సింగ్ స్పందించారు. ఆయన వెంటనే రెస్పాండ్ అయి.. అనీజ్ ఉన్న చోటును గుర్తించారు. వెంటనే అతడిని బరేలీ చేరేందుకు సౌకర్యం కల్పించారు. ఆ వ్యక్తి తన భార్యను సరైన సమయంలో చేరుకోగలిగాడు. ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మరో వీడియో పోస్టు చేసింది తమన్నా. సోషల్ మీడియా ద్వారా వీడియో మేసెజ్ పంపే సమయంలో..తనకు సహాయం లభిస్తుందని ఊహించలేదని చెప్పింది. పోలీసులు రియల్ హీరోలుగా నిలిచారు..బాధ్యతలు, ఒత్తిడిలు ఉన్నా..రణ్ విజయ్ సార్..తమ జీవితాలకు విలువనిచ్చారని తెలిపింది. ఆపద సమయంలో భర్తను తన దగ్గరకు చేర్చిన పోలీసు అధికారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించింది. అందుకే తొలిసారి పుట్టిన బిడ్డకు ఆ మానవతావాది పేరు..మహ్మద్ రణ్ విజయ్ ఖాన్ అని పేరు పెట్టుకుంటామని తమన్నా..కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.