ఉల్లిగడ్డల బుట్టతో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

  • Published By: madhu ,Published On : December 5, 2019 / 06:04 AM IST
ఉల్లిగడ్డల బుట్టతో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

Updated On : December 5, 2019 / 6:04 AM IST

పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓ బుట్టలో ఉల్లిగడ్డలను తీసుకొచ్చి 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా..ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిసెంబర్ 04వ తేదీ బుధవారం జైలు నుంచి విడుదలైన చిదంబరం ఆందోళనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని ప్యాస్ కా దమ్ కమ్ కరో..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాను ఉల్లిగడ్డలను తినని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారని, ఎలాంటి ఆందోళన లేదని చిదంబరం విమర్శించారు. ఉల్లిగడ్డ ధరలను కంట్రోల్ చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవడం జరుగుతోందన్నారు.  

ఇదిలా ఉంటే..ఉల్లిగడ్డ ధరలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. కిలో 100 నుంచి 150కి ఎగబాకడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంత ధర పెట్టి కొనడం లేదని కొంతమంది వాపోతున్నారు. మార్కెట్‌కు సరిపడా ఆశించిన ఉల్లి రావడం లేదని మార్కెటింగ్ కమిటీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఉల్లి దిగుబడి తగ్గి ధర పెరుగుతోందని అంటున్నారు. 
Read More : పార్లమెంట్‌కు వచ్చిన చిదంబరం..మధ్యాహ్నం ప్రెస్ మీట్