Bengaluru : బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక రూ.40 వేలు ఆదా అయ్యాయట.. ఓ వ్యక్తి పోస్ట్ వైరల్
ఫ్యామిలీతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాక రూ.40,000 ఆదా అయ్యాయట. ఓ ఇంటర్నెట్ యూజర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాదు బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత ఎక్కువా? అని ఆశ్చర్యం కలిగిస్తోంది.

Bengaluru
Bengaluru : బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇంటి అద్దెల దగ్గర నుంచి కొనే వస్తువుల దాకా ప్రతీది అధిక ధరలు పలుకుతాయి. రీసెంట్‌గా పృధ్వీ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారడంతో రూ.40,000 ఆదా చేయగలుగుతున్నా అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చకు దారి తీసింది.
ట్విట్టర్ యూజర్ పృధ్వీ రెడ్డి (@prudhvir3ddy) తన పోస్టులో కేవలం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఫ్యామిలీని మార్చడం ద్వారా నెలకు రూ.40,000 ఆదా చేస్తున్నట్లు పేర్కొనడం వైరల్ అవుతోంది. ఆ డబ్బుతో ఓ ఫ్యామిలీ ప్రశాంతంగా జీవించవచ్చునని అతను చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది. తాజాగా పృధ్వీ రెడ్డి తన పోస్టులో ‘బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారాం. నెలకు రూ.40 వేలు ఆదా అయ్యాయి. ఆ డబ్బుతో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించవచ్చు.’ అనే శీర్షికతో షేర్ చేశారు. కొందరు అతను చెప్పినది నిజమేనని అంగీకరిస్తే మరికొందరు వ్యతిరేకించారు.
బెంగళూరులో ఓ మధ్యతరగతి వ్యక్తి జీవించడానికి కనీసం బ్యాచిలర్‌కు రూ.25,000, జంటలకు రూ.50,000 నలుగురు అంతకంటే ఎక్కువమంది ఉంటే రూ.70,000 ఆదాయం కావాల్సిందేనట. ఇతర నగరాలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువనే చెప్పాలి. మధ్య తరగతి వారు ఉద్యోగ రీత్యా తామొక చోట.. తమ ఫ్యామిలీ ఒక చోట ఉంచే పరిస్థితి ఉండదు. కాబట్టి తమకు అనువుగా ఉన్న చోటకు షిఫ్ట్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
Moved from Bangalore to #Hyderabad
Saved 40k per month expenses.
One family can live peacefully with that money. ?
Not seeing any a point of living alone when my values match with my family’s.
— Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023