Weight Loss drink: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగండీ..బరువు తగ్గండీ..
పుల్ల పుల్లగా..తియ్య తియ్యగా ఉండే ఈ డ్రింక్ తాగితే బరువు ఇట్టే తగ్గిపోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకుని తాగే ఈ డ్రింక్ బరువును తగ్గించటంలో భలే పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

Weight Loss Drink
Weight Loss drink: బరువు పెరగటం చాలా ఈజీ. కానీ పెరిగిన బరువు తగ్గాలంటే మాత్రం చాలా చాలా కష్టం.బరువు తగ్గాలంటే వాకింగ్, జిమ్, యోగా, తిండి మానేయాలి. ఇలా ఎన్నో కసరత్తులు చేయాలి.కానీ ఇవే కాకుండా బరువుతగ్గడానికి డిటాక్స్ డ్రింక్స్ కూడా ఎంతో తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపడంలో డిటాక్స్ డ్రింక్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయి.అంతేకాదు వ్యర్ధాలు పేరుకుపోకుండా చేస్తాయి. వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనికూడా ఉండదు.
మన వంటింట్లో దొరికే పదార్ధాలతోనే ఈ డ్రింక్స్‌ను మన ఇంటిలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చక్కగా బరువు తగ్గొచ్చు. బరువుని నియంత్రించడానికి జీరా వాటర్ లాంటివి ప్రయత్నించినట్లే, బెల్లం-నిమ్మరసంతో తయారు చేసిన ఈ స్పెషల్ డ్రింక్‌ను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
Read more : Weight Loss : బరువు తగ్గాలా?అయితే ఈ మూడు రకాల గింజలు తినండీ
బెల్లం-నిమ్మతో ఆరోగ్యాలు అన్నీ ఇన్నీ కాదు..
నిమ్మ రసం బరువుతగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిందే. ఉదయం చాలామంది తేనె,నిమ్మరసం తాగుతారు. ఇది శరీర ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ దీంతో పాటే మరో డ్రింక్ కూడా ఉదయాన్నే తాగితే బరువు కూడా తగ్గొచ్చు. నిమ్మరసానికి తియ్యని తియ్యని బెల్లం జోడిస్తే బరువు భలే తగ్గిపోవచ్చు.ఇది చాలామందికి తెలియదు. కానీ నిమ్మ-బెల్లం భలే కాంబినేషన్ కదూ. బెల్లం తియ్యగా ఉంటే నిమ్మ పుల్లగా ఉంటుంది.
నిమ్మలో లో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని, చర్మ స్వభావాన్ని, జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. అలాగే గుండె పనీతీరును క్రమబద్ధీకరించి, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే స్వీట్స్ తయారీలో విరివిగా ఉపయోగించే బెల్లం కూడా బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
Read more : Weight Loss: బరువు తగ్గాలనుకుంటే ఈ ఫ్రూట్స్ మాత్రం తప్పక తీసుకోవాలి
బెల్లంలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. బెల్లంతో ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇమ్యునిటీని పెంచడానికి, శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమేకాదు బరువును నియంత్రించడంలో ‘హనీ ఈజ్ ద బెస్ట్ లాగే బెల్లం కూడా భలే బెస్ట్ అంటున్నారు నిపుణులు. కాబట్టి బరువును అదుపులో ఉంచడంలో బెల్లం, నిమ్మ రెండూ ఉపయోగపడతాయన్నమాట.
Read more : Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ ఐదింటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి!
బెల్లం – నిమ్మ డ్రింక్ తయారు చేసే విధానం..
మొదటిగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లుపోసి చిన్న బెల్లం ముక్కను వేయాలి. ఆ బెల్లం ముక్క మొత్తం కరిగిపోయేంతవరకూ పొయ్యిమీద పెట్టి సన్నటి మంటమీద మరిగించాలి. ఆ బెల్లం నీరు చల్లారిన తరువాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకుంటే బెల్లం – నిమ్మ డ్రింక్ తాగటానికి రెడీ. ప్రతి ఉదయం క్రమంతప్పకుండా ఈ నిమ్మ-బెల్లం డ్రింక్ తాగితే బరువు చాలా త్వరగా తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.