నేడు భారత్ బంద్…బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
ఇవాళ భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

ఇవాళ భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
ఇవాళ భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమ్మెలో సుమారు 25 కోట్ల మంది పాల్గొంటారని తెలుస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగానే బంద్ చేపడుతున్నామని కార్మిక సంఘాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి కేంద్ర కార్మిక సంఘాలు. ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ సమ్మెకు INTUC, AITUC, CITU, TUCC సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, దీంతో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు 10 కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి.
విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా ఇవాళ పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంక్ యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.
కేంద్రం ఇప్పటికే దేశంలోని 12 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, BPCLను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. BSNL-MTNL విలీనం తర్వాత 93వేల 600 మంది టెలికాం కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు. వీటితో పాటు రైల్వే ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తుల తయారీ యూనిట్ల కార్పొరేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
దీనితో పాటు 175 మందికి పైగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక.. గ్రామీణ భారత్ బంద్ పేరుతో సమ్మెకు మద్దతిస్తునట్లు ప్రకటించాయి. జేఎన్‌యూలో విద్యార్థులపై జరిగిన దాడిని కార్మిక సంఘాలు ఖండించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావాన్ని తెలిపాయి.