Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది.

Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ నూతనోత్సాహాన్ని నింపారు. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. యాత్రలో భాగంగా 136 రోజుల పాటు 4,081 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. ఈ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిధిలోని 75 జిల్లాల్లో 76 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగింది. అంతేకాక, భారత్ జోడో యాత్రలో 100 పైగా గ్రూప్ ఇంటరాక్షన్స్, 250పైగా వాకింగ్ ఇంటరాక్షన్స్ ,100 కార్నర్ మీటింగ్స్, 13 భారీ ర్యాలీలు, 12 మీడియా సమావేశాలు రాహుల్ గాంధీ నిర్వహించారు.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో షెడ్యూల్డ్ ప్రకటించిన కాంగ్రెస్
దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజన రాజకీయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చైనా దురాక్రమణలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ సాగింది. రెండు రాష్ట్రాల్లో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ భారత్ జోడో యాత్రకు బ్రహ్మరథం పట్టారు. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి గురువారంతో సంవత్సరం కావడంతో తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా గురువారం భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన రాహుల్.. ఈసారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
గురువారం దేశవ్యాప్తంగా 722 ప్రాంతాల్లో భారత్ జోడో యాత్రలను ప్రతి జిల్లాలో నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాదయాత్రల నిర్వహణ ఉంటుంది. ఈ భారత్ జోడో పాదయాత్రలో సీడబ్ల్యుసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు ఇన్చార్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. యాత్ర తరువాత భారత్ జోడో సమావేశాలను కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు.