ఢిల్లీ అభివృద్ధిని బీహార్ లో చూపిస్తాం – ఆప్, అక్కడ ఊడ్చేస్తుందా

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 03:08 PM IST
ఢిల్లీ అభివృద్ధిని బీహార్ లో చూపిస్తాం – ఆప్, అక్కడ ఊడ్చేస్తుందా

Updated On : August 28, 2020 / 3:52 PM IST

ఢిల్లీలో చేసిన అభివృద్ధిని బీహార్ రాష్ట్రంలో చేసి చూపిస్తామంటోంది AAP. పాట్నాలో ఆప్ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్స్ ఆకర్షిస్తున్నాయి. కేజ్రీవాల్ కృష్ణుడు అవతారంలో ఉండి..బీహార్ రాష్ట్రాన్ని కాపాడుతున్నట్లుగా ఉంది.



ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి కాపాడాలని, కేజ్రీవాల్ లావో.., బీహార్ బచావో..అంటూ కాప్షన్ జోడించారు. విద్య, ఆరోగ్యం, విద్యుత్ తదితర రంగాల్లో అభివృద్ధిని చేసి చూపిస్తామని, నితీష్ మోడల్ అభివృద్ధిని సవాల్ చేస్తామని ఆప్ బీహార్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంగేషి సింగ్ వెల్లడించారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఢిల్లీలో చేసిన అభివృద్ధిని అందరూ చూస్తున్నారని తెలిపారు. బీహార్ రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని, వలసలు ఎక్కువయ్యాయని, కేజ్రీవాల్ చేసే అభివృద్ధిపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందన్నారు.



243 అసెంబ్లీ స్థానాల్లో పోటీపై ఆయన మాట్లాడారు. ఇతర పార్టీలతో పొత్తు కుదరనప్పుడు అన్ని సీట్లలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పోస్టర్ పై జేడీయూ ప్రతినిధి రాజీవ్ రంజన్ స్పందించారు. ‘rain frog’ గా అభివర్ణించారు. బీహార్ రాష్ట్ర ప్రజలను ఆప్ ఆకట్టుకోలేదని బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ తెలిపారు.
https://10tv.in/tamil-actress-meera-mitun-says-she-wants-to-visit-nithyanandas-kailasa-country/
బీహార్ లో నవంబరు 29వ తేదీతో ప్రభుత్వం గడువు ముగియనుంది. కరోనా వైరస్ మరో వైపు వరదలు బీహార్ ను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. కానీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భావిస్తోందని తెలుస్తోంది.



అక్టోబరు 20వ తేదీన బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. ఇందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది కూడా. ఇప్పుడు బీహార్‌లో విజయం సాధించడం బీజేపీకి ప్రధానం. సోషల్ మీడియాపై బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. డిజిటల్‌ ప్రచారంలో బీజేపీ మిగతా పార్టీల కంటే అన్ని పార్టీలకంటే ముందుంది.

ఆప్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కిషన్ గంజ్, భాగల్ పూర్, సీతామర్హి‌లో పోటీ చేసి పరాజయం చెందింది. అలాగే…2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆప్ పాగా వేయాలని ప్రయత్నించింది. 40 సీట్లకు గాను 39 సీట్లలలో పోటీ చేసింది. కానీ ఎక్కడా గెలుపొందలేదు.



2015లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది ఆప్ పార్టీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీహార్ ఆప్ చీఫ్ సాహూ పాల్గొన్నారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.

పాత ఆర్జేడీ పాలన ఎలా ఉందో ఇప్పటికీ ప్రజల మనస్సులో మెదులుతోందని, తాము సరికొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందిస్తామని హామీనిస్తోంది ఆప్. విద్య, రోడ్లు, ఆరోగ్యం, పేదలకు అవసరమౌన మౌలిక సదుపాయాలపై తాము దృష్టి సారించడం జరుగుతుందని, తాము ప్రజల ముందు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీహర్ ఇన్ ఛార్జీ, పార్టీ కీలక నేతలు రాష్ట్రంలోనే గడపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీహార్ లో ఆప్ ప్రభావితం చేస్తుందా ? లేదా ? అనేది చూడాలి.