రైతులతో కలిసి పోరాడేందుకు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ రాజీనామా

బీజేపీ మిత్రపక్ష పార్టీ నేత రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ శనివారం మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా ప్రకటించారు. కొత్తగా ఆమోదం పొందిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్ధతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
బేనీవాల్ నాగౌర్ నుంచి పోటీచేసి లోక్ సభ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ బీజేపీకి మిత్రపక్ష పార్టీగా వ్యవహరిస్తుంది. పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ లో ఆయన లేవనెత్తిన అంశాలు పట్టించుకోలేదని ఆరోపించారు.
‘కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై చాలా మంది వ్యక్తం చేస్తున్న నిరసనను పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించాను. వాటినన్నింటినీ నిర్లక్ష్యపెట్టారు. ఆ ఇష్యూలపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం విచారకరం. అలా అయితే పార్లమెంటరీ సిస్టమ్ కమిటీలు న్యాయం చేయలేనట్లే’ అని బేనీవాల్ రాజీనామాలో పేర్కొన్నారు.
రైతుల ఆందోళనల కారణంగా వినిపించకుండా పోయిన సమస్యలను వినిపిస్తా. అందుకే కమిటీలకు రాజీనామా ప్రకటిస్తున్నా’ అని బేనీవాల్ అన్నారు.
ఇండస్ట్రీ పార్లమెంటరీ కమిటీలు, పెట్రోలియం సహజ గ్యాస్, పిటిషన్స్ పార్లమెంటరీ కమిటీలకు బేనీవాల్ సభ్యుడిగా ఉన్నారు. ఢిల్లీలో డిసెంబర్ 26న జరిగిన రైతుల పాదయాత్రలోనూ పాల్గొన్న బేనీవాల్ తన నిరసన వ్యక్తం చేశారు.