Karnataka Election 2023: బీజేపీ మూడో జాబితా రిలీజ్.. ఆ మూడు స్థానాల్లో నేతల కుటుంబ సభ్యులకే ఛాన్స్ ..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు స్థానాల్లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కాయి.

Karnataka Election 2023
Karnataka Election 2023: కర్ణాటక (Karnataka) లో మే 10న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ (Nominations Process) కొనసాగుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల జాబితా (LIST OF CANDIDATES) ను విడుదల చేస్తున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగాను అధికార పార్టీ అయిన బీజేపీ (BJP) ఇప్పటికే రెండు దఫాలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 189 మందితో, రెండో జాబితాలో 23 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ రెండు జాబితాల్లో టికెట్లు దక్కని పలువురు నేతలు పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే.
తాజాగా బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు స్థానాల్లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కాయి. తాజాగా మూడో జాబితా రిలీజ్‌తో 222 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. శివమొగ్గ, మాన్వి నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు. ఇదిలాఉంటే, తొలి రెండు జాబితాల్లో జగదీశ్ శెట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లీ – ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్ పేరు ప్రస్తావనకు రాలేదు. అంతేకాక, జగదీశ్ శెట్టర్ కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లీ -ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేష్ టెంగింకై ను పార్టీ బరిలోకి దింపింది.
Karnataka elections 2023: అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
మూడో జాబితాలో ప్రకటించిన పది నియోజకవర్గాల అభ్యర్థుల్లో ముగ్గురు పార్టీ నేతల కుటుంబ సభ్యులే ఉండటం గమనార్హం. మహాదేవపురం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావళి భార్య మంజుల అరవింద్ బరిలోకి దిగనున్నారు. హెబ్బాళ్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు తనయుడు కట్టా జగదీష్ ను పార్టీ బరిలోకి దింపింది.
కొప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొప్పల్ లోక్‌సభ సభ్యుడు కరాడి సంగన్న టికెట్ ఆశించాడు. రెండు జాబితాల్లో టికెట్ జాప్యంకారణంగా అతను పార్లమెంట్ సభ్యత్వంతో పాటు, పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నారు. అయితే, అదే కొప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కారడి సంగన్న కోడలు మంజుల అమరేష్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
https://twitter.com/BJP4India/status/1647949431214592000?cxt=HHwWgMDS9djR2N4tAAAA