Unnao Victim : మోదీకి ఉన్నావ్ బాధితురాలి లేఖ..అభ్యర్థిని మార్చిన బీజేపీ

ఉత్తర్​ప్రదేశ్​ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్​ చైర్మన్​ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది.

Unnao Victim : మోదీకి ఉన్నావ్ బాధితురాలి లేఖ..అభ్యర్థిని మార్చిన బీజేపీ

Bjp

Updated On : June 24, 2021 / 9:41 PM IST

Unnao Victim ఉత్తర్​ప్రదేశ్​ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్​ చైర్మన్​ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది. ఉన్నావ్​ రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​కు అరుణ్ సింగ్ సన్నిహితుడని​.. బాధితురాలు ఆరోపణలు చేయడమే కాకుండా అతనితో తనకు ముప్పు ఉందని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖలు పంపించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చివేస్తూ గురువారం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని బీజేపీ చెబుతూనే నా తండ్రిని చంపిన వారికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కుల్​దీప్​ సింగ్​కు ప్రభుత్వం ఇప్పటికీ మద్దతుగానే నిలుస్తోంది. అరుణ్​ సింగ్​కు పార్టీ టికెట్​ ఇస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అరుణ్​ సింగ్ స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా అని ఉన్నావ్​ బాధితురాలు ఆరోపించింది.

అయితే, అరుణ్ సింగ్ పై ఉన్నావ్ బాధితురాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్​ కిశోర్ రావత్ ఇటీవల ఆరోపించారు. కానీ పార్టీ నిర్ణయం మేరకు అరుణ్​ సింగ్​ నామినేషన్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే అజిత్ సింగ్ భార్య షకున్ సింగ్ ని పార్టీ తరపున జిల్లా పంచాయత్​ చైర్మన్​ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు.