హిందువులు టెర్రరిస్టులా : ఊర్మిళపై కేసు

ముంబై : ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఊర్మిళ కేసు నమోదైంది. ‘హిందుత్వం అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటూ హిందుత్వాన్ని కించపరిచేలా ఊర్మిళ మంటోడ్కర్‌పై వ్యాఖ్యానించారని బీజేపీ అధికార ప్రతినిథి సురేష్ నఖువా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఓ టీవీ జర్నలిస్ట్‌పై కూడా ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సురేష్ నఖువా పేర్కొన్నారు.
‘హిందుత్వం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటు ఆమె భారతదేశంలోని హిందువులను అవమానించారనీ.. హిందువులను టెర్రరిస్టులుగా చూస్తున్నారు’’ అని సురేష్ అన్నారు. సురేష్ నఖువా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనని..సెక్షన్ 295ఏ, 505, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Filed complaint under Section 295A & other relevant sections against Ms Urmila Matondkar, Mr Rahul Gandhi and Mr Rajdeep Sardesai for calling Hinduism most violent religion of the world.#CongressagainstHindus pic.twitter.com/Xf8bl84z97
— Chowkidar Suresh Nakhua ?? (@SureshNakhua) April 6, 2019