Suvendu Adhikari : సహాయ సామాగ్రి దొంగతనం..సువెందు సోదరులపై కేసు నమోదు

బెంగాల్ బీజేపీ నేత సువెందు అధికారి, ఆయన సోదరుడు సౌమెందు అధికారిపైన కాంతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

Suvendu Adhikari : సహాయ సామాగ్రి దొంగతనం..సువెందు సోదరులపై కేసు నమోదు

Bjps Suvendu Adhikari Brother Accused Of Stealing Relief Material Case Filed

Updated On : June 6, 2021 / 6:24 PM IST

Suvendu Adhikari బెంగాల్ బీజేపీ నేత సువెందు అధికారి, ఆయన సోదరుడు సౌమెందు అధికారిపైన కGతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. సువెందు,ఆయన సోదరుడి ఆధ్వర్యంలో పూర్బా మెడినిపూర్ జిల్లాలోని కాంతి మున్సిపల్ కార్యాలయం నుంచి లక్షల రూపాయల విలువైన సహాయ సామాగ్రిని దొంగలించబడిందంటూ కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు సభ్యుడు రత్నదిప్ మన్నా చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారం ఇప్పుడు బెంగాల్ లో సంచలనమైంది.

మే-29 న సువెందు అధికారి, ఆయన సోదరుడు, కంతి మున్సిపాలిటీ మాజీ కమిషనర్ కూడా అయిన సౌమెందు అధికారి సూచనలతో కొందరు మున్సిపల్ కార్యాలయం గోడౌన్ తాళాలు పగులగొట్టి అందులోని లక్షల రూపాయల విలువైన సహాయ సామాగ్రిని, ట్రక్కు లోడ్ టార్పాలిన్ తదితరాలను బలవంతంగా తీసుకుపోయారని, పైగా ఇందుకు..తమ సెక్యూరిటీగా ఉన్న కేంద్ర దళాలను కూడా వినియోగించుకున్నారంటూ జూన్-1 కంతి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో రత్నదిప్ మున్నా పేర్కొన్నారు. కాగా ఓ చీటింగ్ కేసులో సువెందు అధికారికి సన్నిహితుడైన రఖల్ బేరా అనే వ్యక్తిని కోల్ కతా పోలీసులు అరెస్టు చేసిన రోజే(శనివారం) ఈ కేసు దాఖలైంది. 2019 లో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..ఓ వ్యక్తి వద్ద నుంచి రఖల్ ఖేరా 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, తాజా పరిణామాలపై సువెందు అధికారి గానీ, ఆయన సోదరుడు గానీ స్పందించలేదు. కాగా, గతేడాది నవంబర్ వరకు మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సువెందు అధికారి డిసెంబర్ 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతపైనే పోటీ చేసి విజయం సాధించాడు సువెందు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేతగా సువెందు కొనసాగుతున్న విషయం తెలిసిందే.