BMW ఇండియా సీఈవో కన్నుమూత

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ తెలిపింది. 2019 ఆగస్టు1న రుద్రతేజ్ సింగ్ సీఈవోగా నియమితులయ్యారు. గత 8నెలలుగా బీఎండబ్ల్యూ భారత ప్రెసిడెంట్‌గా, సీఈవోగా రుద్రతేజ్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.
రూడీగా ప్రజాదరణ పొందిన ఆయన.. BMW ఇండియా కార్యకలాపాలకు నాయకత్వం వహించిన మొదటి భారతీయుడు. ఆయన ఆకస్మిక మరణం పట్ల వ్యాపార ప్రముఖులుల సంతాపం ప్రకటిస్తున్నారు. 1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ క్రమంగా ఎదుగుతూ విజయ పథాన్ని నిర్మించుకున్నారు.
25ఏళ్ల అనుభవమున్న రూడీ…ఆటోమోటివ్ మరియు నానో ఆటోమోటివ్ ఇండస్ట్రీ రెండింటిలోనూ వివిధ నాయకత్వ స్థాయిలను నిర్వహించారు. హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీకి భారత్‌లో, అంతర్జాతీయ మార్కెట్లలోనూ 16ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలు అందించారు. చివరగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్‌గా విశేషంగా రాణించారు.