BOI : కోటి రూపాయల ప్రయోజనాలు.. ఉద్యోగుల కోసం ఆ బ్యాంక్ స్పెషల్ స్కీమ్
ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ

Boi
BOI : ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం “శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్” పేరుతో స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ఉద్యోగులు ఉచితంగా కోటి రూపాయల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది.
PF Transfer Online : మీ అకౌంట్ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. BOI శాలరీ ప్లస్ అకౌంట్ పథకం కింద మూడు రకాల జీతాల ఖాతా సౌకర్యం ఉంది. పారా మిలటరీ ఫోర్స్, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, కాలేజ్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు జీతం అకౌంట్ స్కీమ్ ఉంది. శాలరీ ఖాతాను జీరో-బ్యాలెన్స్ ఖాతా అని కూడా తెలిపింది. అందుకే శాలరీ ఖాతాను నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. శాలరీ ఖాతాలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!
రూ. కోటి వరకు ఉచిత ప్రమాద బీమా
BOI సాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ కింద వినియోగదారులకు రూ.కోటి వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద జీతం అకౌంట్ ఉన్న ఖాతాదారులకు బ్యాంక్ రూ.30 లక్షల వరకు ప్రమాదవశాత్తు డెత్ కవర్ అందిస్తోంది. బ్యాంక్ ట్వీట్ ప్రకారం జీతం అకౌంట్ హోల్డర్‌కు రూ.కోటి ఉచిత విమాన ప్రమాద బీమా ఇవ్వబడుతుంది.
* వేతన ఖాతాదారులకు రూ. 2 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం.
* ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ రూ.2 లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
* ఉచితంగా గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు (గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు) ఇస్తోంది.
* ఏడాదికి 100 చెక్స్ లీవ్స్ గల బుక్ ఉచితంగానే అందిస్తారు.
* డీమ్యాట్ ఖాతాల(డీమ్యాట్ అకౌంట్స్)పై ఎఎంసి ఛార్జ్ విధించరు.
* లోన్ల విషయంలో ఖాతాదారులకు 0.25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుంది.
ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ కింద ఖాతా ఓపెన్ చేయవచ్చు. నెలకు రూ.10వేలు సంపాదించే వారు ఈ పథకం కింద వేతన ఖాతాలను తెరవొచ్చు. కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. వేతన ఖాతాదారుడు రూ.5 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అలాగే ఉచితంగా గ్లోబల్ డెబిట్ కమ్ ఏటీఎం పొందుతారు.
A custom-made scheme specially crafted for Government employees!
BOI presents Salary Plus Account Scheme
For details,
contact us on 1800 103 1906 or Visit https://t.co/hjQfbXn3I4 pic.twitter.com/M9z76cmigB— Bank of India (@BankofIndia_IN) September 11, 2021