భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ భర్త భరణం ఇవ్వాల్సిందే: బాంబే హైకోర్టు
ప్రతి నెల రూ.లక్ష సంపాదిస్తున్న భర్తకు ఇతర ఆర్థికపరమైన బాధ్యతలు ఏవీ లేవని ధర్మాసనం గుర్తించింది.

విభేదాల కారణంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్న దంపతుల్లో భార్య జాబ్ చేస్తున్నప్పటికీ ఆమెకు భర్త భరణం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు తెలిపింది. భార్య గౌరవప్రదమైన జీవనం కోసం ఆమెకు భర్త ప్రతి నెల రూ.15 వేలు భరణం కింద ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.
Also Read: వృద్ధుల పట్ల అతి దారుణంగా వ్యవహరించిన ఓల్డేజ్ హోం నిర్వాహకులు.. ఏమేం చేశారంటే?
అయితే, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును భర్త బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. తన భార్య ఉద్యోగం చేస్తూ ప్రతి నెల రూ.25 వేలు సంపాదిస్తోందని, తాను భరణం చెల్లించాల్సిన అవసరం లేదని భర్త వాదించాడు. అయితే, ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది.
ప్రతి నెల రూ.లక్ష సంపాదిస్తున్న భర్తకు ఇతర ఆర్థికపరమైన బాధ్యతలు ఏవీ లేవని ధర్మాసనం గుర్తించింది. చివరకు అతడు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమెకు సంపాదిస్తోందన్న కారణంతో భర్త నుంచి ఆర్థిక సాయం పొందకుండా నిరోధించలేమని తెలిపింది.