Delhi Nightlife: ఢిల్లీలో నైట్ లైఫ్ జోష్.. బార్లు, రెస్టారెంట్లు 24 గంటలూ ఓపెన్

ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, ఐఎస్‌బీటీ పరిధిలోని రెస్టారెంట్లు, బార్లు కూడా 24 గంటలూ తెరిచే ఉంటాయి. ఇక 3 స్టార్ హోటల్స్‌లో రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. మిగతా చోట్ల బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచే ఛాన్స్ ఉంటుంది.

Delhi Nightlife: ఢిల్లీలో నైట్ లైఫ్ జోష్.. బార్లు, రెస్టారెంట్లు 24 గంటలూ ఓపెన్

Updated On : December 31, 2022 / 9:14 PM IST

Delhi Nightlife: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ఇకపై నైట్ లైఫ్ మరింత కిక్ ఇవ్వనుంది. ఇరవై నాలుగు గంటలూ రెస్టారెంట్లు, బార్లు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, బార్లు, రెస్టారెంట్లు అన్ని చోట్లా 24 గంటలు తెరిచే అవకాశం లేదు. 5 స్టార్, 4 స్టార్ హోటళ్లలో మాత్రమే దీనికి అనుమతి ఉంటుంది.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

అది కూడా హోటల్‌లోని ఏదైనా ఒక్క రెస్టారెంట్, బార్ మాత్రమే తెరిచి ఉంచాలి. అలాగే ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, ఐఎస్‌బీటీ పరిధిలోని రెస్టారెంట్లు, బార్లు కూడా 24 గంటలూ తెరిచే ఉంటాయి. ఇక 3 స్టార్ హోటల్స్‌లో రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. మిగతా చోట్ల బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచే ఛాన్స్ ఉంటుంది. జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశంపై గత నవంబర్‌లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచన మేరకు ఈ నిబంధన అమలు చేయనున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు పంపుతారు.

Mahabubabad: లారీపై నుంచి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి.. ఆటోలోని ముగ్గురు ప్రయాణికులు మృతి

అక్కడ తగిన మార్పులు, చేర్పులు చేశాక దీన్ని కేంద్ర హోం శాఖ అనుమతికి పంపిస్తారు. ఈ శాఖ నుంచి అనుమతి లభిస్తే, త్వరలోనే ఈ కొత్త రూల్ అందుబాటులోకి రానుంది. ఈ రూల్ అమలు చేయాలంటే పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలకు కేంద్ర హోం శాఖ అనుమతించాలి. లైసెన్స్‌ల జారీలో పాటించాల్సిన నిబంధనలు, అనుమతుల మంజూరు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త రూల్ అమలు చేస్తారు.