Parliament Winter Session: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
: కరోనా పరిస్థితులతో పాటు అజెండాలో ఉన్న చాలా అంశాలపై చర్చలు పూర్తయిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ముగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Parliament
Parliament Winter Session: కరోనా పరిస్థితులతో పాటు అజెండాలో ఉన్న చాలా అంశాలపై చర్చలు పూర్తయిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ముగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 9బిల్లులు ఆమోదం పొందాయి. వ్యవసాయ చట్టాల రద్దు, ఎన్నికల చట్ట సవరణ బిల్లు సహా ద్రవ్య వినిమయ బిల్లులకు సైతం ఆమోదం వచ్చింది. మళ్లీ 2022 జనవరి చివరి వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నట్లు సమాచారం.
నవంబరు 29న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 23 వరకు కొనసాగాల్సి ఉంది. ఈ సమావేశాలకు సోమవారం వరకు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ మంగళవారం కరోనా బారిన పడ్డారు.
……………………………………: సంక్రాంతి సినిమాలు.. ఫుల్‌గా ఆర్ఆర్ఆర్.. డల్‌గా రాధేశ్యామ్!
మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ వీరిపై వేటు వేశారు. ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళనకు దిగాయి.
…………………………………: విలీనం దిశగా జీ-సోనీలకు అప్రూవల్