నాగిన్ డ్యాన్స్ చేసిన వరుడు..ఆగిపోయిన పెళ్లి

  • Published By: venkaiahnaidu ,Published On : November 12, 2019 / 06:06 AM IST
నాగిన్ డ్యాన్స్ చేసిన వరుడు..ఆగిపోయిన పెళ్లి

Updated On : November 12, 2019 / 6:06 AM IST

మరికొన్ని నిమిషాల్లో పెళ్లి పీటలపై ఎక్కబోతున్న సమయంలో పెళ్లికొడుకుకి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. తాను పెళ్లికి ఒప్పుకోనని చెప్పేసింది. అయితే పెళ్లి కొడుకు చేసిన నాగిన్ డ్యాన్స్ కే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని లక్ష్మిపూర్ కేరిలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది.

శుక్రవారం పెళ్లికి ఏర్పాట్లు పూర్తి అయిన సమయంలో పెళ్లి కొడుకుని అతడి ఫ్రెండ్స్ బలవంతంగా పంక్షన్ లో ఏర్పాటుచేసిన డ్యాన్స్ ఫ్లోర్ పైకి లాగారు. ఫుల్ గా తాగి నాగిన్ డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కొడుకుని కిందకు తీసుకొచ్చేందుకు పెళ్లికూతరు కుటుంబసభ్యులు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫుల్ గా తాగి ఉన్న పెళ్లికొడుకు వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే ఈ తతంగమంతా గమనించిన పెళ్లికూతురు తాను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పింది.

అయితే పెళ్లికొడుకు కుటుంబసభ్యులు నచ్చజెప్పేందుకు ఎన్ని ప్రయత్నించినా వినలేదు. పెళ్లి చేసుకోనని క్లారిటీగా చెప్పేసింది. దీంతో ఇరు కుటుంబాలు మధ్యవర్తిత్వం వహించి కేసు ఫైల్ చేయకుండా సమస్య పరిష్కరించాలని పోలీసును ఆశ్రయించారు. చివరికి పెళ్లి ఏర్పాట్లుకు,ఫుడ్ కి అయిన ఖర్చులు ఇచ్చేందుకు వరుడు కుటుంబసభ్యులు అంగీకరించారు.