Bridge Collapse: కుప్పకూలిపోయిన బ్రిడ్జి.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు

బ్రిడ్జి నిర్మాణ వైఫల్యం బట్టబయలైంది. పొరుగు గ్రామాలకు చేరుకునే అవకాశం లేదు..

Bridge Collapse: కుప్పకూలిపోయిన బ్రిడ్జి.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు

Bridge Collapse

Updated On : June 22, 2024 / 3:19 PM IST

బిహార్‌లోని సివాన్‌లో ఓ బ్రిడ్జి కుప్పకూలింది. గండక్ కాల్వపై బ్రిడ్జి కూలిపోవడంతో దర్భంగా జిల్లా, రామ్‌గఢ్ వరకు భారీ శబ్దాలు వినపడ్డాయి. బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. బ్రిడ్జి కూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

బ్రిడ్జి నిర్మాణ వైఫల్యం బట్టబయలైంది. ఈ బ్రిడ్జి మహారాజ్‌గంజ్ జిల్లాలోని పటేధి బజార్ మార్కెట్‌ల నుంచి రామ్‌గఢ్ పంచాయతీ వరకు వెళ్లడానికి స్థానికులకు బాగా ఉపయోగపడేది. బ్రిడ్జి కుప్పకూలడంతో గండక్ కాలువ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక చాలా దూరం ప్రయాణిస్తేగానీ పొరుగు గ్రామాలకు చేరుకునే అవకాశం లేదు. బ్రిడ్జి కుప్పకూలిన దృశ్యాలు అక్కడి కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల బక్రా నదిపై కాంక్రీట్ బ్రిడ్జి కూలిపోయింది. అరారియాలో జరిగిన ఈ ఘటనను మరవక ముందే బిహార్ లో ఇప్పుడు మరో బ్రిడ్జి కూలడం గమనార్హం.

Also Read: ఏ ప్రశ్నాపత్రం లీకవుతుందో తెలియదు, ఏ పరీక్ష రద్దు చేస్తారో తెలియదు.. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం