India Border: పాకిస్తాన్ నుంచి వచ్చిన ‘మేడ్ ఇన్ చైనా’ డ్రోన్ కూల్చివేసిన భారత భద్రతా దళాలు

పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి వస్తున్న మేడ్ ఇన్ చైనా డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భద్రతా దళాలు కూల్చివేశాయి.

India Border: పాకిస్తాన్ నుంచి వచ్చిన ‘మేడ్ ఇన్ చైనా’ డ్రోన్ కూల్చివేసిన భారత భద్రతా దళాలు

Bsf

Updated On : April 29, 2022 / 7:13 PM IST

India Border: పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి వస్తున్న మేడ్ ఇన్ చైనా డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భద్రతా దళాలు కూల్చివేశాయి. BSF అధికారులు తెలిపిన వివరాలు మేరకు..అమృత్‌సర్ సెక్టార్‌లోని ధనో కలాన్ గ్రామ పరిధిలో ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు వద్ద గురువారం రాత్రి భద్రతా సిబ్బంది గస్తీ తిరుగుతున్న సమయంలో డ్రోన్ చప్పుడు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చీకటిగా ఉన్న ప్రాంతంలో వెలుగు కోసం పారా బాంబులను ప్రయోగించి ఆకాశంలో తిరుగుతున్న డ్రోన్ ను కూల్చివేశారు. అనంతరం శుక్రవారం ఉదయం ఆప్రాంతంలో తనిఖీలు చేపట్టిన BSF అధికారులు..రాత్రి కూల్చివేసిన డ్రోన్ ను గుర్తించారు. డ్రోన్ చైనాలో తయారైందిగా గుర్తించిన అధికారులు..అది పాకిస్తాన్ నుంచి భారత్ లోకి వస్తున్నట్లు నిర్ధారించుకున్నారు.

Also read:Pakistan PM: పాకిస్తాన్ ప్రధానికి సౌదీలో ఘోర అవమానం: ‘దొంగ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు

ఘటనపై స్థానిక పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చిన BSF అధికారులు, వారి సహాయంతో ధనో కలాన్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డ్రోన్ కదలికలపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. కాగా, భారత సరిహద్దు వద్ద నక్కివున్న ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ నుంచి మందుగుండు సామాగ్రిని డ్రోన్ల ద్వారా సరఫరా అవుతున్నట్లు భారత భద్రతా దళాలు గతంలోనే గుర్తించాయి. దీంతో సరిహద్దు వెంట ముమ్మర గస్తీ ఏర్పాటు చేసి, డ్రోన్ కదలికలపై గట్టి నిఘా ఉంచారు.

Also read:India – China Visas: చైనానే మనకు వీసాలు ఇవ్వడంలేదు: భారత విదేశాంగశాఖ కార్యదర్శి