పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ : విత్తనాల ధర తగ్గింపు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 06:38 AM IST
పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ : విత్తనాల ధర తగ్గింపు

ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నకిలి పత్తి విత్తలతో మోసపోయిన రైతులకు కేంద్రం తీసుకన్న ఈ నిర్ణయంతో వారు ఇక విత్తనాలు తక్కువ ధరకు  కొనుగోలు చేసుకోవచ్చు. 
 

ప్యాకెట్ బీటీ పత్తి విత్తనాలపై కేంద్రం విధించిన రాయల్టీ ఫీజును ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో విత్తనాలపై రాయల్టీ ఎత్తివేత వల్ల రైతులకు పత్తివిత్తనాలు తక్కువ ధరకు లభించనున్నాయి. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ప్రధానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.