Saharanpur Bulldozer : వారి ఇళ్లు కూల్చివేత.. యూపీలో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్

ఉత్తరప్రదేశ్ లో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్ కు దిగింది. షహరాన్ పూర్ లో బుల్డోజర్లను దింపింది. నిన్న నమాజ్ తర్వాత..

Saharanpur Bulldozer : వారి ఇళ్లు కూల్చివేత.. యూపీలో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్

Saharanpur Bulldozer

Updated On : June 11, 2022 / 7:54 PM IST

Saharanpur Bulldozer : ఉత్తరప్రదేశ్ లో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్ కు దిగింది. షహరాన్ పూర్ లో బుల్డోజర్లను దింపింది. నిన్న నమాజ్ తర్వాత చెలరేగిన అల్లర్లపై సర్కార్ చర్యలు తీసుకుంది. అల్లర్ల సూత్రధారుల్లో ఇద్దరి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఆ ఇద్దరు ఇళ్లను అక్రమంగా నిర్మించినట్టు అధికారులు ఆరోపించారు. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నిన్న దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

షహరాన్ పూర్ లో కూడా ఆందోళనలు జరిగాయి. అదే సమయంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, యాక్షన్ లోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అల్లర్ల కేసులో ఇప్పటికే 227 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 68మంది ప్రయాగ్ రాజ్ కి చెందిన వారున్నారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

షహరాన్ పూర్ కి చెందిన ఇద్దరిని అల్లర్లకు సూత్రధారులుగా గుర్తించారు. ఆ ఇద్దరిని విచారించిన సమయంలో వారు నివాసం ఉంటున్న ఇళ్లు అక్రమ కట్టడాలు అని తేలింది. దీంతో ఆ ఇళ్లను బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు అధికారులు. మరోవైపు ఇవాళ కూడా వెస్ట్ బెంగాల్ లో పలు చోట్ల నిరసనలకు దిగారు.

Taslima Nasreen : ‘మహ్మద్ ప్రవక్త జీవించి ఉంటే’..అంటూ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్ సహా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళ‌నలకు దిగారు ముస్లింలు. భార‌తీయ‌ ఉత్ప‌త్తుల‌ను ముస్లిం దేశాల‌న్నీ బ‌హిష్క‌రించాలంటూ బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. భారత ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని నినదించారు.