Teachers recruitment Scam : బెంగాల్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. 26వేల మంది టీచ‌ర్ల ఉద్యోగాల ర‌ద్దు.. జీతాలు వెన‌క్కి..

కోల్‌క‌తా హైకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా దాదాపు 26 వేల మంది టీచ‌ర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు.

Teachers recruitment Scam : బెంగాల్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. 26వేల మంది టీచ‌ర్ల ఉద్యోగాల ర‌ద్దు.. జీతాలు వెన‌క్కి..

Calcutta HC voids 2016 West Bengal SSC recruitment

కోల్‌క‌తా హైకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా దాదాపు 26 వేల మంది టీచ‌ర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2016లో జ‌రిగిన టీచ‌ర్ల రిక్రూర్‌మెంట్ టెస్టును హైకోర్టు ర‌ద్దు చేసింది. ఆ ప‌రీక్ష ద్వారా జ‌రిపిన నియామ‌కాలు త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. ఈ ప‌రీక్ష ద్వారా ఉద్యోగాలు సాధించిన టీచ‌ర్లు తాము పొందిన వేత‌నాల‌ను తిరిగి ఇచ్చేయాల‌ని తీర్పులో న్యాయ‌స్థానం వెల్ల‌డించింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల‌తో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామ‌కం కోసం 2016లో బెంగాల్ ప్ర‌భుత్వం స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) ను నిర్వ‌హించింది. 24,650 ఖాళీల భ‌ర్తీ కోసం ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 23 ల‌క్ష‌ల మందికి పైగా ఈ ప‌రీక్ష రాశారు. అనంత‌రం ఎంపిక ప్ర‌క్రియ చేప‌ట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెట‌ర్‌లు ఇచ్చారు.

అయితే.. ఈ ప‌రీక్ష‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని న్యాయ‌స్థానాల్లో పిటిష‌న్లు దాఖ‌లు కావ‌డంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు కోల్‌క‌తా హైకోర్టు ప్ర‌త్యేక డివిజ‌న్ బెంచ్‌ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం 2016 నాటి టీచ‌ర్ల నియామ‌క ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని అందుక‌నే అది చెల్ల‌ద‌ని తీర్పు చెప్పింది.

Video: ఎండ వేడి గురించి వార్తలు చదువుతూ అదే వేడికి లైవ్‌లో స్పృహ తప్పిన యాంకరమ్మ

వెంట‌నే కొత్త నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని ప‌శ్చిమ బెంగాల్ స్కూల్ క‌మిష‌న్‌కు సూచించింది. ఈ వ్య‌వ‌హారంపై మ‌రింత స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని, మూడు నెల‌ల్లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి ఆదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో 2016 ఉపాధ్యాయ నిమాయ‌క పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కు తాము అందుకున్న వేత‌నాల‌ను నాలుగు వార్ల‌లోనూ తిరిగి ఇచ్చేయాల‌ని ఆదేశించింది. ఆ న‌గ‌దు వ‌సూలు బాధ్య‌త‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది.

కాగా.. ఇప్ప‌టికే ఈ కుంభ‌కోణానికి మాజీ విద్యాశాఖ మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పార్థా చ‌ట‌ర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.