కశ్మీరీ అయితే టెర్రరిస్టేనా? కొట్టేస్తారా?

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 10:44 AM IST
కశ్మీరీ అయితే టెర్రరిస్టేనా? కొట్టేస్తారా?

Updated On : March 7, 2019 / 10:44 AM IST

పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్‌లోని వివిధ ప్రదేశాలలో కాశ్మీరీలపై  దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జర్నలిస్ట్‌పై యువకులు దాడి చేసిన ఘటన మరువకముందే ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. దాలి గంజ్ ఏరియాలో డ్రైఫ్రూట్స్ అమ్ముతున్న కాశ్మీరి వ్యాపారులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కశ్మీరీలు ఇక్కడ వ్యాపరం చేసుకునేందుకు వీళ్లేదు అంటూ కర్రలతో దాడి చేశారు.

బాధితులు తమ ఐడీ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తున్నా కూడా వదలకుండా వాళ్లని కొట్టడం వీడియోలో రికార్డ్ అయ్యింది. మహ్మద్ అప్జల్ నాయక్, అబ్దుల్ సల్మాన్ అనే ఇద్దరు  వ్యక్తులను హిందుత్వ సంఘాలకు చెందినవారు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. విశ్వ హిందూ దల్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు దాడికి పాల్పడిన హిమాన్షు అవస్తిని అరెస్ట్ చేశారు.

అయితే కొట్టినట్లుగా వీడియో తీసి పెట్టుకున్న అతను ఫేస్‌బుక్ నుండి తర్వాత ఆ వీడియోను తొలగించారు. కాగా టెర్రరిస్టులం అంటూ మమ్మల్ని తీవ్రంగా కొట్టారంటూ చిరువ్యాపారస్థులు పోలీసులకు తెలిపారు. అయితే స్థానికులు వారిని రక్షించారంటూ వారు తెలిపారు. దీనిపై స్పందించిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.