లక్కంటే వీడిదే: కారు ఢీకొట్టింది.. సైకిల్ ముక్కలైంది.. సేఫ్
కారు వేగానికి సైకిల్ తో పాటు గాల్లోకి ఎగిరాడు. సైకిల్ రెండు ముక్కలయింది. కుర్రాడు గాల్లోనే రెండు పల్టీలు కొట్టి కొన్ని మీటర్ల దూరంలో కిందపడ్డాడు.

కారు వేగానికి సైకిల్ తో పాటు గాల్లోకి ఎగిరాడు. సైకిల్ రెండు ముక్కలయింది. కుర్రాడు గాల్లోనే రెండు పల్టీలు కొట్టి కొన్ని మీటర్ల దూరంలో కిందపడ్డాడు.
రోడ్డుకు ఒకవైపు నుంచి కారు వేగంగా దూసుకొస్తోంది. మరోవైపు నుంచి 14ఏళ్ల కుర్రాడు సైకిల్ పై రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు అమాంతం అతడ్ని ఢీకొట్టింది. కారు వేగానికి సైకిల్ తో పాటు గాల్లోకి ఎగిరాడు. సైకిల్ రెండు ముక్కలయింది. కుర్రాడు గాల్లోనే రెండు పల్టీలు కొట్టి కొన్ని మీటర్ల దూరంలో కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ ప్రమాదం హర్యాయానాలోని కురక్షేత్ర ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుర్రాడు మృత్యువు అంచుల వరకు పోయి లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు.
కారు ఢీకొట్టిన వేగానికి సైకిల్ పై కుర్రాడు చనిపోయి ఉంటాడని అందరు భావించారు. భూమి మీద నూకలయిన్నాయేమో.. ఏమో.. యమపురి దగ్గరగా వెళ్లి యమధర్మరాజుకు ఇలా హాయ్ చెప్పొచ్చాడు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న అతడ్ని అక్కడి స్థానికులు సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు క్రాస్ చేస్తున్న సైకిల్ కుర్రాడిని కారు ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.