షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే..రూ. 50 లక్షల Cashback

మీరు వింటున్నది నిజమే. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే..ఓ దుకాణ యజమాని రూ. 50 వేల క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ చేసిన వివాదస్పద ప్రకటన వైరల్ గా మారింది. కేరళలో ఓ షాపు యజమాని ఈ విధంగా చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు.
కరోనా వైరస్ రావొద్దని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ..కేరళలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ యజమాని..వినూత్న ఆఫర్ ప్రకటించాడు. పేపర్లో ఉన్న యాడ్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు.
తమ వద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ షాపింగ్ చేసి కోవిడ్ – 19 తెచ్చుకుంటే కేవలం 24 గంటల్లో రూ. 50 వేల క్యాష్ బ్యాక్, GST లేకుండానే అందిస్తామని ప్రకటించాడు. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించాడు.
అయితే..జనాలు భయపడుతారని అనుకున్నారు. కానీ షాపింగ్ చేయడానికి కొంతమంది ఆసక్తి చూపడం విశేషం. విషయం వైరల్ గా మారిపోయింది. కొట్టాయమ్ కు చెందిన ఓ లాయర్ స్పందించారు.
నేరుగా సీఎం పినరయి విజయన్ కు లేఖ రాశారు. వెంటనే సీఎం కార్యాలయం స్పందించి పలు ఆదేశాలు జారీ చేసింది. దుకాణం మూసివేయాలని పోలీసులు సూచించారు. యజమానిపై దర్యాప్తు ప్రారంభించారు.