పిల్లులను పట్టుకుంటే.. లక్ష రూపాయలిస్తాం
ఇది అక్షరాల నిజం. పిల్లులను పట్టుకుని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనికి టెండర్లు కూడా వేస్తున్నారట. రాజ్‌భవన్‌లోని 'బ్రుహత్ బెంగళూరు మహానగర పలికే' బిల్డింగ్‌లో 30పిల్లులను పట్టుకుంటే దాదాపు రూ.లక్ష ఇస్తామంటూ టెండర్లకు ఆహ్వానం పలికింది.

ఇది అక్షరాల నిజం. పిల్లులను పట్టుకుని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనికి టెండర్లు కూడా వేస్తున్నారట. రాజ్‌భవన్‌లోని ‘బ్రుహత్ బెంగళూరు మహానగర పలికే’ బిల్డింగ్‌లో 30పిల్లులను పట్టుకుంటే దాదాపు రూ.లక్ష ఇస్తామంటూ టెండర్లకు ఆహ్వానం పలికింది.
ఇది అక్షరాల నిజం. పిల్లులను పట్టుకుని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనికి టెండర్లు కూడా వేస్తున్నారట. రాజ్‌భవన్‌లోని ‘బ్రుహత్ బెంగళూరు మహానగర పలికే’ బిల్డింగ్‌లో 30పిల్లులను పట్టుకుంటే దాదాపు రూ.లక్ష ఇస్తామంటూ టెండర్లకు ఆహ్వానం పలికింది.
‘రాజ్‌భవన్‌లో పిల్లులు పెరిగిపోతున్నాయని వాటి చేష్టలతో వాతావరణమంతా చికాకుగా మారిందట. బీబీఎమ్‌పీ సూచన మేరకు ఒక్కో పిల్లికి రూ.3వేల చొప్పున 30పిల్లులకు కలిపి రూ.95వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సిటీ మేయర్ గంగంబికే మల్లికార్జున్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Read Also : హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్
బీబీఎమ్‌పీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘పిల్లుల బెడద చికాకు తెప్పిస్తుందని ఫిర్యాదు చేశాం. ఈ మేరకు జంతు సంరక్షణ విభాగం టెండర్ విడుదల చేసింది. రూ.95వేలు వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పిల్లులను పట్టుకునే క్రమంలో వాటికి హాని తలపెట్టకూడదు. పట్టుకోవడంలో ఎక్స్‌పర్ట్‌లు ఉంటే కావాలి. వెటర్నరీ అధికారుల సమక్షంలోనే పట్టుకోవాలి. రవాణా చేసేందుకు అద్దెకు తెచ్చిన వాహనాలను వాడుకోవాలి’ అని చెప్పారు.
బెంగళూరు సిటీ వ్యాప్తంగా జంతు సంరక్షణ చేపడుతున్నారు కానీ, వాటి జననాలను నియంత్రించేందుకు, కుక్కల నుంచి రేబిస్ వ్యాధి సోకకుండా టీకాలు వంటివి ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేకపోతుందంటూ బీబీఎమ్‌పీ ఇటీవలే విమర్శలు చేసింది.
Read Also : ‘మా’ ఎన్నికలు: రెండు ప్యానల్‌ల సభ్యులు వీళ్లే!