Five States Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల వివరాలు ఇలా.. తెలంగాణలో నూతన ఓటర్లు ఎంతమంది అంటే?
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

voters
Telangana Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, రాజస్థాన్ లో నవంబర్ 23న అదేవిధంగా మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న , చత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. నోటిఫికేషన్ విడుదల సందర్భంగా సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించామని తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 679 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయని, వీటిల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాల వారిగా ఓటర్ల వివరాలు పరిశీలిస్తే..
తెలంగాణ రాష్ట్రంలో..
మొత్తం ఓటర్లు 3.17 కోట్ల మంది
పురుషులు 1.58 కోట్లు
స్త్రీలు 1.58 కోట్లు
కొత్త ఓట్లు 8.11 లక్షల మంది
మిజోరాం రాష్ట్రంలో..
మొత్తం ఓటర్లు 8.52 లక్షల మంది
పురుషులు : 4.13లక్షలు
స్త్రీలు : 4.39లక్షలు
కొత్త ఓటర్లు : 50.611 మంది
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో..
మొత్తం ఓటర్లు 2.03 కోట్ల మంది.
పురుషులు : 1.01 కోట్లు
స్త్రీలు : 1.02 కోట్లు
కొత్త ఓటర్లు : 7.23లక్షల మంది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో..
మొత్తం ఓటర్లు : 5.6 కోట్ల మంది
పురుషులు : 2.88 కోట్లు
స్త్రీలు : 2.72 కోట్లు
కొత్త ఓటర్లు : 22.36లక్షల మంది
రాజస్థాన్ రాష్ట్రంలో..
మొత్తం ఓటర్లు : 5.25 కోట్ల మంది.
పురుషులు : 2.73 కోట్లు
స్త్రీలు : 2.52 కోట్లు
కొత్త ఓటర్లు : 22.04 లక్షలు
మొత్తం ఐదు రాష్ట్రాల్లో పురుష ఓటర్లు 8.2 కోట్లు, స్త్రీ ఓటర్లు 7.8 కోట్లు, మొదటి సారి ఓటర్లు 60.2లక్షల మంది.