అయోధ్య కేసు..వివాదంలో లేని భూమిపై కేంద్రం పిటిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : January 29, 2019 / 06:43 AM IST
అయోధ్య కేసు..వివాదంలో లేని భూమిపై కేంద్రం పిటిషన్

Updated On : January 29, 2019 / 6:43 AM IST

అయోధ్య కేసుకి సంబంధించి మంగళవారం(జనవరి 29, 2019) కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాస్పద రామజన్మభూమి-మసీదు దగ్గర్లో వివాదంలో లేని 67 ఎకరాల స్థలాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలని ఇవ్వాలని సుప్రీంని కేంద్రం కోరింది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం వివాదాస్పద భూమితో పాటుగా చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది.

దీంతో  వివాదంలో లేని భూమిని దాని యజమాని అయిన రామజన్మభూమి  నయాస్ లేదా రామాలయానికి సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం తన పిటిషన్ లో తెలిపింది.  వివాదాస్పద భూమిని మూడు పార్టీలు సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖారా, రామ్ అల్లా సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు వాస్తవానికి ఆదివారం విచారణ జరగాల్సి ఉంది. అయితే ధర్మాసనంలోని జడ్జి జస్టిస్ ఎస్ కే బోబ్డే అనారోగ్య కారణాలతో హాజరుకాకపోవడంతో మంగళవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేశారు.