Covid cases : కేరళలో కొవిడ్ కేసుల కలకలం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమీక్ష
దేశంలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.....

Union Health Minister Mansukh Mandaviya
Covid cases : దేశంలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది. కేరళలో మంగళవారం 292 కొత్త కొవిడ్ -19 యాక్టివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహించారు.
ALSO READ : Heavy Rain : తమిళనాడులో భారీవర్షాలు, వరదలు…10 మంది మృతి
ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ఎస్పీ సింగ్ బాఘేల్, భారతి ప్రవీణ్ పవార్, ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహ్ల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ పాల్గొన్నారు. కేరళ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,041కి చేరింది. గత 24 గంటల్లో కొవిడ్ -19 నుంచి 224 మంది కోలుకున్నారు.అంతకుముందు రోజుతో పోలిస్తే 341 కేసులు పెరగడంతో భారత్‌లో క్రియాశీల కేసుల సంఖ్య బుధవారం 2,311కి పెరిగింది.
ALSO READ : Covid-19 JN.1 : కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వల్ల ప్రమాదం లేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, వైరస్ సంక్రమణను నివారించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. కొవిడ్ రోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, గదులు, ఆక్సిజన్ బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వీణా వివరించారు.