Bharat Jodo Yatra: ఢిల్లీలో రాహుల్ పాదయాత్ర షురూ.. కొవిడ్ నిబంధనలు విడుదల చేయాలన్న ఆప్

పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పనిసరి పాటించేలా కొవిడ్-19 నియమ, నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు, పాదయాత్రలు చేసేవారు కూడా తప్పనిసరిగా వాటిని పాటించేలా చేయాలని పేర్కొంది. భారత్ జోడో యాత్ర ఇవాళ ఢిల్లీలో ప్రారంభమైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సూచన చేయడం గమనార్హం.

Bharat Jodo Yatra: ఢిల్లీలో రాహుల్ పాదయాత్ర షురూ.. కొవిడ్ నిబంధనలు విడుదల చేయాలన్న ఆప్

Bharat Jodo Yatra

Updated On : December 24, 2022 / 3:49 PM IST

Bharat Jodo Yatra: పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పనిసరి పాటించేలా కొవిడ్-19 నియమ, నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు, పాదయాత్రలు చేసేవారు కూడా తప్పనిసరిగా వాటిని పాటించేలా చేయాలని పేర్కొంది. భారత్ జోడో యాత్ర ఇవాళ ఢిల్లీలో ప్రారంభమైంది.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సూచన చేయడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చంద్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… 2020, 2021లో దేశంలో మొదటి, రెండో దశలో కరోనా విజృంభించిన పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు రాకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అందుకే కరోనా నియమ, నిబంధనలను విడుదల చేయాలని అన్నారు.

కరోనా వల్ల తలెత్తే సంక్షోభ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్లే దేశంలో అప్పట్లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందిందని చెప్పారు. ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రొటోకాల్ జారీ చేయలేదని ఆయన విమర్శించారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే వారు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని అన్నారు.

Bangladesh vs India: రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే బంగ్లా ఆలౌట్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన భారత్