Kejriwal Cloths : కేజ్రీవాల్ దుస్తులపై పంజాబ్ సీఎం కామెంట్స్..ఢిల్లీ సీఎం కౌంటర్

అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలంటూ పంజాబ్ సీఎం చేసిన వివాదాస్పద కామెంట్స్ కు ఢిల్లీ సీఎం తనదైన స్టైల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

Kejriwal Cloths : కేజ్రీవాల్ దుస్తులపై పంజాబ్ సీఎం కామెంట్స్..ఢిల్లీ సీఎం కౌంటర్

Delhi

Updated On : October 6, 2021 / 9:18 PM IST

Kejriwal Cloths  అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలంటూ పంజాబ్ సీఎం చేసిన వివాదాస్పద కామెంట్స్ కు ఢిల్లీ సీఎం తనదైన స్టైల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ తన ట్వీట్ లో….చన్నీగారు మీకు నా బట్టలు నచ్చక పోయినా పర్వాలేదు. ప్రజలకు నచ్చుతాయి.అది చాలు. దుస్తుల గురించి వదిలేయండి. ప్రజలకు మీరిచ్చిన ఈ 4 వాగ్దానాలను ఎప్పుడు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి? 1. ప్రతి నిరుద్యోగికి ఎప్పుడు ఉపాధి కల్పిస్తారు? 2. రైతుల రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారు? 3. మతం పేరుతో అల్లర్లకు పాల్పడేవారిని జైళ్లకు ఎందుకు పంపడం లేదు? 4. అవినీతి మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

కాగా,మంగళవారం ఓ ఇంటర్వ్యూలో పంజాబ్ సీఎం చన్నీ మాట్లాడుతూ..మీ దగ్గర రూ.5వేలు ఉంటే కేజ్రీవాల్ కు ఇవ్వండి. ఆయనకు మంచి దుస్తులు అవసరం. ఆయన జీతం రూ. 2.5 లక్షలు. మంచి దుస్తులు కొనుక్కోలేరా? అంటూ కేజ్రీవాల్ ను విమర్శించారు.

మరోవైపు, పంజాబ్ లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా పంజాబ్ లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ ఉవ్విళ్లూరుతోంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ మధ్యే గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య మాటల మధ్య యుద్ధం సాగుతోంది.

ALSO READ  ముప్పు ఇంకా తొలగలేదు, కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక