Chennai rain: మిగ్‌జామ్ తుపాన్‌తో చెన్నైలో భారీవర్షాలు, వరదలు…పాఠశాలలు మూసివేత

మిగ్‌జామ్ తుపాన్‌తో చెన్నైలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై నగరంలో వరదలు వెల్లువెత్తాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి....

Chennai rain: మిగ్‌జామ్ తుపాన్‌తో చెన్నైలో భారీవర్షాలు, వరదలు…పాఠశాలలు మూసివేత

Chennai floods

Chennai rain: మిగ్‌జామ్ తుపాన్‌తో చెన్నైలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై నగరంలో వరదలు వెల్లువెత్తాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల చెన్నై నగరంలో మృతుల సంఖ్య 20కి పెరిగింది. చెన్నై నగరంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది.

ALSO READ : Telangana CM Revanth Reddy : చకా చకా హామీల అమలు…తొలిరోజే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

మిగ్ జామ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటినా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ తుపాన్ ప్రభావం వల్ల డిసెంబరు 8,9 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, కరైకల్, పుదుచ్చేరి లో వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. తమిళనాడులోని నీలగిరి, ఘాట్ ప్రాంతాలు, కోయంబత్తూర్, విరూధ్ నగర్, శివగంగా, పుదుక్కొట్టాయి, తంజావూరు, దిండిగల్, తేని జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

ALSO READ : KCR Hospitalised: ఫాంహౌజ్‭లో జారిపడ్డ కేసీఆర్.. కాలి ఎముక విరిగిందన్న వైద్యులు

చెన్నై నగరంలో సహాయ పునరావాస పనుల కోసం 9వేలమంది అధికారులను నియమించామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శివదాస్ మీనా చెప్పారు. 343 ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది. భారీవర్షాల నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. చెన్నైలో తు;eను తర్వాత భారీ వర్షాల కారణంగా వరదల మధ్య ప్రజలను రక్షించి సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు.

ALSO READ : Manipur : మణిపూర్‌ సర్కార్ సంచలన నిర్ణయం… 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత

చెన్నైలో గత కొద్ది రోజుల్లో 1,400 చెట్లు కూలిపోయాయని, వాటిలో 243 చెట్లు ఇంకా తొలగించాల్సి ఉందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. లోతట్టు ప్రాంతాల నుంచి వరద నీటిని బయటకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.చెన్నై సెంట్రల్, ఎగ్మోర్ నుంచి రైలు సర్వీసులను పునరుద్ధరించారు.