Child Pornography చూసిన 261 మంది పై కేసు నమోదు…41 మంది అరెస్ట్

Child Pornography Crime News : దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో కేరళ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 268 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. వీరిలో 41 మందిని అరెస్ట్ చేశారు. కేరళ సైబర్ క్రైమ్ సెల్ వారి లెక్కల ప్రకారం లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు.
అరెస్టైన నిందితులు చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్….డౌన్ లోడ్ చేసారని…వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో ఎక్కువ 6నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలకు సంబంధించిన వీడియోలను వారు అప్లోడ్,డౌన్ లోడ్ చేసినట్లు గుర్తించారు.
సైబర్ క్రైం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 3వారాలపాటు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టి అరెస్ట్ లు జరిపారు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోపాటు నేరాలను పెంచిందని అడిషనల్ డీజీపీ మనోజ్ అబ్రహం వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా విధించిన “లాక్ డౌన్” ప్రజలలో డిజిటల్ వినియోగాన్ని పెంచింది. దానితో పాటు అశ్లీల చిత్రాలు చూడటం కూడా పెంచిందని ముఖ్యంగా మైనర్ పిల్లలలో డార్క్నెట్ వాడకం బాగా పెరిగిందని అబ్రహం వ్యాఖ్యానించారు. ఇలాంటి పిల్లలలోనేర ప్రవృత్తి పెరగకుండా వారిని మానసిక వైద్యులకు చూపించాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.