WHO Global Report: భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు.. దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయ్.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

2020 - 2030 మధ్య కాలంలో దాదాపు 500 మిలియన్ల మంది గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం, ఇతర నాన్‌కమ్యూనికేబుల్ వ్యాధులు (NCD) భారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.

WHO Global Report: భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు.. దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయ్.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

WHO Global Report

Updated On : October 24, 2022 / 9:59 AM IST

WHO Global Report: 2020 – 2030 మధ్య కాలంలో దాదాపు 500 మిలియన్ల మంది గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం, ఇతర నాన్‌కమ్యూనికేబుల్ వ్యాధులు (NCD) భారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. 2020-2030 మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రజల్లో మరింత శారీరక శ్రమను ప్రోత్సహించడానికి తక్షణ చర్య తీసుకోవాలని, లేకుంటే సంవత్సరానికి 27 బిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఫిజికల్ యాక్టివిటీపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 ప్రకారం.. అన్ని వయసులు, సామర్థ్యాలలో శారీరక శ్రమను పెంచడానికి ప్రభుత్వాలు ఎంత మేరకు సిఫార్సులను అమలు చేస్తున్నాయో సర్వే చేసింది.

WHO Warning On Syrups: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ఆ నాలుగు సిరప్‌లపై విచారణకు ఆదేశించిన సీడీఎస్‌సీఓ

మొత్తం 194 దేశాల నుంచి వచ్చిన డేటా ప్రకారం పురోగతి నెమ్మదిగా ఉందని, శారీరక శ్రమ స్థాయిలను పెంచడానికి, తద్వారా వ్యాధిని నిరోధించడానికి ఇప్పటికే  ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించి అమలును దేశాలు వేగవంతం చేయాలని నివేదిక వెల్లడించింది. 50శాతంకంటే తక్కువ దేశాల్లో ప్రజల శారీరక శ్రమ విధానాన్ని కలిగి ఉన్నాయని, అందులో 40శాతం కంటే తక్కువ దేశాలు పనిచేస్తున్నాయని నివేదిక తెలిపింది. 30శాతం దేశాలు మాత్రమే అన్ని వయసుల వారికి జాతీయ శారీరక శ్రమ మార్గదర్శకాలను అందిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. నడక, సైకిల్ తొక్కడం, క్రీడలు, ఇతర శారీరక శ్రమల ద్వారా ప్రజలు మరింత చురుగ్గా ఉండేలా పాలసీల అమలును పెంచడానికి మరిన్ని దేశాలు కృషిచేయాలని నివేదిక పేర్కొంది.

Whooping cough : చిన్నారుల్లో కోరింత దగ్గు సమస్య! దుమ్మూ,ధూళికి దూరంగా ఉండటం మంచిది.

భారతదేశంలో.. నివేదిక ప్రకారం దేశంలో బద్ధకస్తులు ఎక్కువయ్యారని, శారీరక శ్రమ చేయకపోవటంతో పలు దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నట్లు నివేదిక తెలిపింది. భారత్ లో 11-17 మధ్య వయస్సు వారిలో 74శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదు. అందులో బాలురు 72శాతం, బాలికలు 76శాతం ఉన్నారు. 18ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44శాతం, పురుషులు 25శాతం వ్యాయామం చేయడం లేదని నివేదిక తెలిపింది. 70ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 60శాతం, పురుషులు 38శాతం శారీరక శ్రమ చేయడం లేదు. దీనిద్వారా వారు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని నయం చేసుకొనేందుకు దేశంలో ఏడాదికి రూ.25,600 కోట్లు ఖర్చు అవుతోందని, వచ్చే పదేళ్లలో అది రెండు లక్షలకోట్లకు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

Double Chin : గొంతు క్రింద కొవ్వు అధికంగా ఉంటే జాగ్రత్త పడాల్సిందేనా?

దేశంలో ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడకుండా ఉండేలాంటే కొన్ని సిఫార్సులను డబ్ల్యూహెచ్ఓ నివేదిక సూచించింది. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43శాతం మేర వ్యాయామం లేకపోవటమే కారణమని, నడకకు అనువైన రహదారుల వ్యవస్థను ప్రభుత్వాలు నెలకొల్పాలని నివేదిక పేర్కొంది. వాహనాల వేగంపై నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడంపై నియంత్రణ ఉండాలి. శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాలని, ప్రతీ ఒక్కరికీ వారానికి 300 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి అని నివేదిక తెలిపింది.

Donkey In Court: గాడిదలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. న్యాయమూర్తి ఏం చేశారంటే?

18ఏళ్లు పైబడిన వారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి. 11-17మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి. 18ఏళ్లు పైబడిన వారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. 50ఏళ్లు పైబడిన వారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్ లు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఫిజికల్ యాక్టివిటీపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 నివేదికలో పేర్కొంది.