ఎమ్మెల్యే చెన్నమనేనికి కేంద్ర హోంశాఖ షాక్
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ తగిలింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ తగిలింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ తగిలింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని హోంశాఖ తెలిపింది. హోంశాఖ ఆదేశాలతో చెన్నమనేని ఎమ్మెల్యే పదవిని కోల్పేయే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవి ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. కేంద్ర హోంశాఖ తీర్పుపై చెన్నమనేని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని చెన్నమనేని రమేష్ చెప్పారు.
2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు చెన్నమనేని రమేశ్. అప్పటినుంచీ ఆయన పౌరసత్వంపై వివాదం రగులుతూనే ఉంది. జర్మనీ దేశస్తురాలిని వివాహం చేసుకోవడంతో పాటు… ఆ దేశ పౌరసత్వాన్ని పొందారన్నది రమేష్ బాబుపై ఉన్న ఆరోపణ. ఎన్నికల్లో పోటీ చేసే ముందు భారతదేశ పౌరసత్వాన్ని తిరిగిపొందడానికి… నిబంధనలు పాటించకుండా తప్పుడు ధృవపత్రాలను సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. 2009లోనే ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హై కోర్టు 2013 ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు రమేష్ బాబు. అలాగే పౌరసత్వ వివాదం కేంద్ర హోంశాఖే తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు.
దీంతో కేంద్ర హోంశాఖ రమేష్ బాబు పౌరసత్వం పై విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యుల కమిటిని నియమించింది. గతంలో రమేష్ బాబు జర్మనీ వెళ్లడం…అక్కడ సాగించిన కార్యకలాపాల పై సమగ్రంగా త్రిమెన్ కమిటి విచారణ చేపట్టింది. కమిటి ఇచ్చిన నివేదిక మేరకు నిబందనలు పాటించకుండానే భారత పౌరసత్వం రమేష్ బాబు పొందారని పౌరసత్వన్ని రద్దు చేసింది కేంద్ర హోంశాఖ.
అయితే దీని పై మళ్లీ రివ్యు పిటిషన్ దాఖలు చేశారు రమేష్ బాబు. రివ్యూ తరువాత 2017 డిసెంబర్ లో మరోసారి కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వం పై రమేష్ బాబుకి వ్యతిరేకంగా ఆదేశాలను జారీ చేసింది. అయితే.. దీన్ని 2019 జూలై 23 న హైకోర్టు రద్దు చేసింది. త్రీమెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై పునఃపరిశీలించి 12 వారాల్లో తేల్చాలని హోమ్ శాఖని ఆదేశించింది. మరోసారి రమేశ్‌బాబు వాదనలను విన్న హోంశాఖ… రమేశ్‌బాబుకు వ్యతిరేకంగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. శాసనసభ సభ్యత్వాన్ని ఆయన కోల్పోయే ప్రమాదం ఉంది.