Arvind Kejriwal: 240 ప్రభుత్వ పాఠశాలల్లో 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభించిన సీఎం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభించారు. దేశరాజధాని ఢిల్లీలోని రాజోక్రీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 240ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ క్లాసుల

Sweetest Terrorist In The World Cm Kejriwal
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభించారు. దేశరాజధాని ఢిల్లీలోని రాజోక్రీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 240ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ క్లాసుల నిర్వహణ జరగనుంది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి సిసోడియా, ఢిల్లీ హోం మినిష్టర్ సత్యేందర్ జైన్ లు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ఢిల్లీ గవర్నమెంట్ ఏడేళ్లుగా ఏడు వేల క్లాసు రూంలను నిర్మించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిపినా 20వేలకు మించి నిర్మించలేకపోయారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అందుకోవాలని బాబా సాహెబ్ అంబేద్కర్ కల కనేవారు’
‘దురదృష్టవశాత్తు 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో అతని కలను మిగిలిన ఏ రాష్ట్రం సాకారం చేయలేకపోయింది. కనీసం ఢిల్లీలోనైనా ఆయన కలను నెరవేర్చినందుకు నేను సంతోషంగా ఉన్నా. కొద్ది రోజులుగా దేశంలోని చాలా మంది నాయకులు కేజ్రీవాల్ టెర్రరిస్టు అంటుంటే నాకు నవ్వొస్తుంది. టెర్రరిస్టు అని పిలుస్తున్న వ్యక్తే ఈ రోజు దేశం కోసం 12వేల 430క్లాసు రూంలను అంకితం ఇస్తున్నాడు’ అని కేజ్రీవాల్ వివరించారు.
Read Also: ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా: కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు
స్మార్ట్ క్లాసు రూంలతో కలిపి కేజ్రీవాల్ ప్రభుత్వం మొత్తం 20వేల క్లాసు రూంలను ఏర్పాటు చేసినట్లు అయింది. అందులో 537కొత్త స్కూల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయని ఢిల్లీ గవర్నమెంట్ స్టేట్మెంట్ లో పేర్కొంది. ఆ క్లాస్ రూంలలో లైబ్రరీలు, మల్టీ పర్పస్ హాల్స్ లాంటివన్నీ ఏర్పాటు చేశారు.
दिल्ली के सरकारी स्कूलों में 12,430 नए और शानदार क्लासरूम बनकर तैयार। उद्घाटन कार्यक्रम | LIVE https://t.co/yLKRRQarZg
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 19, 2022