Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలుకు భారీ బహుమతే ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్‌ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్‌ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన కార్యాలయంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు.

Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలుకు భారీ బహుమతే ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య

Updated On : June 1, 2023 / 9:05 AM IST

Sunil Kanugolu: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యా భారీ బహుమానమే ఇచ్చారు. ఆయనను ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా క్యాబినెట్‌ హోదాతో నియమించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా ఏడాది క్రితం నియమితుడైన సునీల్‌ కనుగోలు.. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై ‘40 శాతం కమిషన్‌ సర్కారు’ వంటి కీలక అంశాలను ఆ పార్టీకి అస్త్రాలుగా అందించారు. కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్‌ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్‌ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన కార్యాలయంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు.