BF-7 Variant : చెన్నైలో కొత్త కోవిడ్ కేసులు..ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం స్టాలిన్ భేటీ

BF-7 Omicron Variant ఆందోళనతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.సీఎం స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.తమిళనాడు రాజధాని చెన్నైలోని సెక్రటేరియట్‌లో ఆరోగ్యమంత్రి ఎంఏ సుబ్రమణియన్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.

BF-7 Variant : చెన్నైలో కొత్త కోవిడ్ కేసులు..ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం స్టాలిన్ భేటీ

CM Stalin holds high-level meeting to review COVID situation

Updated On : December 22, 2022 / 3:59 PM IST

BF-7 Omicron Variant  : కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 వేరియంట్‌ గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో ఈ కొత్త వేరియంట్ కల్లోలం సృష్టించగా అదిప్పుడు భారత్ కూడా వ్యాపించింది. భారత్ లో ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 వేరియంట్‌ కరోనా కేసులు మూడు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర అప్రమత్తమవ్వటమే కాకు అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమావేశం నిర్వహించమే కాకుండా ఈరోజు గురువారం (డిసెంబర్ 22,2022) ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
BF 7 Omicron Sub Variant : BF7 కోవిడ్ వేరియంట్‌పై భారత్ అప్రమత్తం..ప్రధాని అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.సీఎం స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.తమిళనాడు రాజధాని చెన్నైలోని సెక్రటేరియట్‌లో ఆరోగ్యమంత్రి ఎంఏ సుబ్రమణియన్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.

BF 7 Omicron Sub Variant : BF 7వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం .. కొత్త మార్గదర్శకాలు

కరోనా నియమ నిబంధనలతో పాటు మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, ఒడిశాలో మూడు కేసులు నమోదు కావటంతో సీఎం స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సి జాగ్రత్తలపై సీరియస్ గా చర్చిస్తున్నారు. వచ్చినతరువాత జాగ్రత్తలు తీసుకోవటం కంటేముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై అధికారులతో చర్చలు జరిపారు.

BF-7 Omicron Variant : భారత్ లోకి ప్రవేశించిన బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్.. గుజరాత్, ఒడిశాలో కేసులు గుర్తింపు

అందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి ప్రధాన కొవిడ్ నియమాలను తప్పనిసరి చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. కాగా..కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ తో చైనా కల్లోలంగా మారింది. ఈ ప్రభావం పలుదేశాలకు విస్తరించింది.భారత్ కూడా అప్రమత్తమై బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి చర్యలు తీసుకుంటోంది.