ప్రధానిపై ఏ ఫిర్యాదైనా లోక్‌పాల్ ఫుల్‌బెంచ్ కెళ్తుంది… ఒకవేళ తిరస్కరిస్తే మాత్రం వివరణ అక్కర్లేదు…

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 06:41 AM IST
ప్రధానిపై ఏ ఫిర్యాదైనా లోక్‌పాల్ ఫుల్‌బెంచ్ కెళ్తుంది… ఒకవేళ తిరస్కరిస్తే మాత్రం వివరణ అక్కర్లేదు…

Updated On : March 4, 2020 / 6:41 AM IST

ఏ ప్రధాన మంత్రిపైనా లోక్ పాల్ ఫుల్ బెంచ్‌కు ఫిర్యాదు అందినా..దానిని తిరస్కరించితే..ఎలాంటి వివరణనివ్వాల్సిన అవసరం లేదని తాజాగా నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అవినీతికి పాల్పడితే ప్రధాని మొదలుకొని ప్రభుత్వ అధికారులను విచారించే అధికారం కలిగిన లోక్‌ పాల్‌ కమిటీ ఎట్టకేలకు కార్యరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియో్గానికి పాల్పడకుండా..ప్రజా నిఘా సంస్థగా లోక్ పాల్ వ్యవహరించనుంది. సిట్టింగ్ లేదా మాజీ ప్రధానమంత్రులపై ఫిర్యాదు చేస్తే విచారణ జరపాలా ? వద్దా ? అనేది ధర్మాసనం నిర్ణయిస్తుంది. 

లోక్ పాల్ 2020 సంబంధించి మార్చి 02వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానిపై దాఖలు చేసిన కంప్లయింట్‌పై ఛైర్ పర్సన్ నేతృత్వంలోని పూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని, కనీసం మూడింట రెండొంతుల మంది విచారణనను ఆమోదిస్తారని నోటిఫికేషన్‌లో తెలిపింది.

 చట్టంలోని సెక్షన్ 14లోని సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (ఏ)లో సూచించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగిపై ఫిర్యాదు దాఖలు అయితే..క్లాజ్ (ఏ) లోని సబ్ క్లాజ్ (II)లో సూచించిన విధంగా..పూర్తి బెంచ్ ద్వారా నిర్ణయించబడుతుందని తెలిపింది. ఫిర్యాదు కొట్టివేయవచ్చు అని నిర్ధారణకు వస్తే..విచారణకు సంబంధించిన రికార్డులు ప్రచురించకుండా ఉండడమే కాకుండా..ఎవరికీ అందుబాటులో ఉండవని వెల్లడించింది. 

See Also | కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

కేంద్ర మంత్రి లేదా పార్లమెంట్ సభ్యుడిపై ఫిర్యాదు దాఖలైతే..లోక్ పాల్‌లో ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేయాల్సి ఉంటుందని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. లోక్ పాల్ ఆఫీసు ఇంకా పూర్తిగా పనిచేయడం లేదని, అవినీతి నిరోధక అంబుడ్స్ మెన్ కేంద్ర అనుమతి కోసం వెయిట్ చేస్తోందని తెలిపింది. 

లోక్ పాల్ జస్టిస్ (రిటైర్డ్) పినాకీ చంద్ర ఘోష్‌కు ఫిర్యాదులు పంపవచ్చని, ప్రాథమిక విచారణకు ఆదేశించవచ్చు. ఫిర్యాదు విషయంలో సీబీఐ వంటి వాటితో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. భారత పౌరుడు కాని వారు కూడా ఫిర్యాదు చేయవచ్చు. పాస్ పోర్టు కాపీ గుర్తింపుగా అంగీకరించబడుతుంది. నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఫిర్యాదు చేస్తే..అది 15 రోజుల్లో సమర్పించబడుతుంది. 

Read More : కరోనా వైరస్ సోకిందని..భార్యను ఏం చేశాడో తెలుసా