డిగ్గీరాజా వ్యాఖ్యలు : గాసిప్ మాంగర్ అంటు బీజేపీ కౌంటర్

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 11:39 AM IST
డిగ్గీరాజా వ్యాఖ్యలు : గాసిప్ మాంగర్ అంటు బీజేపీ కౌంటర్

Updated On : January 9, 2019 / 11:39 AM IST

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటరిచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతను ఆశపెట్టిందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేతలు  అబద్ధాలను ప్రచారం చేస్తారు కాబట్టే దిగ్విజయ్ ను ‘‘గాసిప్ మాంగర్’’ అంటారని కౌంటరిచ్చారు. 

ఈ కౌంటర్లు, రివర్స్ కౌంటర్స్ గోలంతా..మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి..కాంగ్రెస్ విజయంతో వచ్చాయి. మధ్యప్రదేశ్ లో తాజా ఎన్నికల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాయం చేయాలని సబల్‌ఘర్‌ ఎమ్మెల్యే బాజీనాథ్‌ కుష్వాహాను బీజేపీకి నేత నారాయణ్ త్రిపాఠి ఓ దాబా హోటల్ కు వెళ్లారనీ..అక్కడ  బీజేపీ నేతలు, మాజీ మంత్రులైన నరోత్తమ్‌ మిశ్రా, విశ్వాస్‌ సారంగ్‌ బాజీనాథ్‌తో కుష్వాహాతో భేటీ అయ్యారని తెలిపారు. వారంతా కుష్వాహాను కోరారని దిగ్విజయ్ ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాక కుష్వాహాకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారనీ..ఈ ఆఫర్ ను కుష్వాహా తిరస్కరించారని దిగ్విజయ్ అన్నారు. కాగా, ఈ ఆరోపణలను మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఖండిస్తు..దీనికి సంబంధించిన ఆధారాలుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల బీజేపీ పాలనకు మధ్యప్రదేశ్ లో తెరపడిన క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు పన్నిన కుట్రల్లో భాగంగా కాంగ్రెస్ నేత కుష్వాహాను బీజేపీ ప్రలోభపెట్టిందని దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.