Priyanka Gandhi Vadra : కాంగ్రెస్ కీలక నిర్ణయం..యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

Congress
Congress key decision : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. తాము మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
మహిళలు అధికారంలో పూర్తిస్థాయి భాగస్వాములు కావాలని ఆశిస్తున్నట్లు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. మంగళవారం(అక్టోబర్ 19, 2021)న లక్నోలో ప్రియాంకాగాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇవాళ తమ మొదటి హామీ గురించి మాట్లాడబోతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది యూపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Tirumala Special Darshanam : వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం పునరుధ్దరించ లేదు
భవిష్యత్తులో మహిళలకు కేటాయించే టికెట్ల సంఖ్యను 40 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మహిళలంతా రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.