3 State Assembly Results: లోక్‭సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి దారుణ ఓటమి!

వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది

3 State Assembly Results: లోక్‭సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి దారుణ ఓటమి!

లోక్‭సభ ఎన్నికలు మరో ఆరు నెలలు కూడా లేదు. అంతలోనే కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తలిగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో హస్తం కాస్త పుంజుకున్నప్పటికీ మిగిలిన మూడు రాష్ట్రాల్లో దారుణ ఓటమిని చవి చూస్తున్నట్లు కనిపిస్తోంది. హిందీ బెల్టులో కీలకంగా ఉన్న మూడు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. భారీ ఓటమి దిశగా పయనిస్తోంది.

తెలంగాణలో 17 లోక్‭సభ స్థానాలు ఉండగా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో 65 (రాజస్థాన్ 25, మధ్యప్రదేశ్ 29, ఛత్తీస్‭గఢ్ 11) స్థానాలు ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ భారీగా లాస్ అయినట్లే తెలుస్తోంది. పైగా దక్షిణాదితో పోల్చుకుంటే జాతీయ పార్టీలకు ఉత్తరాది చాలా కీలకం. అందునా హిందీ బెల్టు రాష్ట్రాల్లో తమ సత్తా చాటడం మరీ ముఖ్యం. అలాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజారిటీ దిశగా పయనిస్తుండడం గమనార్హం.

వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ కీలకమైన మూడు రాష్ట్రాల్లో ఆ ఓటమితో రాబోయే రోజులు కష్టమనే వాదన వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఆశాజనమైన విషయం ఏంటంటే.. తెలంగాణ దక్షిణాది ప్రాంతం కావడం.. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండో రాష్ట్రం. దక్షిణాదిలో బీజేపీ లేకపోవడంతో మిగిలిన పార్టీలతో కలిసి వెళ్లే అవకాశం కాంగ్రెస్ కు ఉంటుంది.