Kerala Scientists : గాలి ద్వారా కరోనాకు చెక్..సైంటిస్టుల కొత్త పరికరం

గాలి ద్వారా వైరస్ ను అడ్డుకొనేందుకు కేరళ శాస్త్రవేత్తలు కొత్త పరికరం కనుగొన్నారు. వుల్ఫ్ ఎయిర్ మాస్క్ అనే దానిని కనిపెట్టారు.

Kerala Scientists : గాలి ద్వారా కరోనాకు చెక్..సైంటిస్టుల కొత్త పరికరం

Electronic device

Control Corona In Air : కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్ ను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఇంకా కృషి చేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నాయి పలు దేశాలు. భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తోంది. గత ఏడాది పరిస్థితులు మరలా ఏర్పడుతాయా అనే భయం అందరిలో కలుగుతోంది. అయితే..కరోనా ఎలా వ్యాపిస్తుందోనడానికి ప్రయోగాలు జరుగతున్నాయి.

ప్రధానంగా..గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని పలువురు శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. గాలి ద్వారా వైరస్ ను అడ్డుకొనేందుకు కేరళ శాస్త్రవేత్తలు కొత్త పరికరం కనుగొన్నారు. వుల్ఫ్ ఎయిర్ మాస్క్ అనే దానిని కనిపెట్టారు. వైరస్ ను నిర్వీర్యం చేస్తుందని, ఆల్ అబౌట్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ దీనిని రూపొందించింది.

15 నిమిషాల్లోనే..90 శాతం మేర కరోనా వైరస్ ను తగ్గిస్తుందని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ నిర్వహించిన పరీక్షల్లో ఇది వెల్లడైంది. ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు ఇతర పని ప్రదేశాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోని గాలిని శుద్ధి చేస్తుందని, దీనికి ఎలాంటి సర్వీసింగ్ అవసరం కూడా లేదన్నారు. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలను ఇది చంపేస్తుందని, స్విచాన్ చేయగానే..రక్షణ చట్రాన్ని నలువైపులా విస్తరిస్తుందన్నారు.