ఎండవేడి : దేవుళ్లకు కూలర్లు, ఫ్యాన్లు తో సేవ 

  • Published By: chvmurthy ,Published On : May 10, 2019 / 10:52 AM IST
ఎండవేడి : దేవుళ్లకు కూలర్లు, ఫ్యాన్లు తో సేవ 

Updated On : May 10, 2019 / 10:52 AM IST

లక్నో: మండుతున్నఎండ దెబ్బకు మానవులే రోడ్డు మీదకు రావటానికి జంకుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు నీడ పట్టున ఉంటున్నారు. ఇళ్లలో ఎవరి స్తోమతను బట్టి వారు కూలర్లు, ఏసీలలో సేద తీరుతున్నారు. పసిపిల్లలను, వృధ్ధులను, పశువులను ఎండబారి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో ఐతే దేవాలయాల్లో దేవుళ్ళుకు కూడా ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు అక్కడి నిర్వాహకులు. దీనిపై స్ధానిక సిధ్దివినాయక టెంపుల్ ఆలయ అర్చకులు సుర్జిత్ కుమార్ దుబే మాట్లాడుతూ… దేవుళ్లు సైతం మనుషుల మాదిరిగానే ఎండవేడిని భరిస్తున్నారు. అందువల్లే వారికి చల్లదనం కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని దేవుళ్లకు పలుచని వస్త్రాలతో అలంకరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.