ఇన్‌స్పెక్టర్ తలపై ఎక్కి కోతి వీరంగం

ఇన్‌స్పెక్టర్ తలపై ఎక్కి కోతి వీరంగం

Updated On : October 9, 2019 / 10:02 AM IST

పోలీసులకే చుక్కలు చూపించింది కోతి. ఇన్‌స్పెక్టర్ తలపైకి ఎక్కి దిగనంటే దిగనంటూ మొండికేసింది. దీంతో ఆ ఎస్ఐ కోతి తన మాట వినడం లేదని తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్న వీడియో వైరల్ గా మారింది. మంగళవారం యూపీలోని పిలిభిట్ జిల్లాలో సదార్ కొట్వాలీ పోలీస్ స్టేషన్‌ లోపలికి కోతి చొరబడింది. కిటికీలో నుంచి వచ్చిన కోతి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తలపైకి ఎక్కి కూర్చుంది. 

భుజాల పైకి ఎక్కి తలలో పేలు వెదుకుతూ కూర్చుంది. ఇన్‌స్పెక్టర్ తన పని తాను చేసుకుంటూ ఇక చాలు కిందకి దిగు అని అడుగుతుంటే తనకేం పట్టనట్లు కూర్చొని పేలు వెదికే పనిలో మునిగిపోయింది. స్టేషన్లోని సిబ్బంది నవ్వులు వీడియోలో వినిపిస్తున్నాయి. ఇద్దరు పోలీసులు ఆ కోతిని కిందకు దించడానికి తంటాలు పడుతూ కనిపించారు. అరటిపండు వేస్తే కోతి తప్పుకుంటుందని చెప్పడంతో వీడియో అయిపోయింది. 

ఈ వీడియోలో ఉంది శ్రీకాంత్ ద్వివేదిగా స్థానిక మీడియా చెప్పుకొచ్చింది. వీడియోను సోషల్ మీడియాలో చూసిన తర్వాత పనిలో ఉండగా రీతా, శిఖాకాయ్, షాంపోల వంటి వాటితో డిస్టర్బ్ చేసినా పని వదలకూడదని ఈ వీడియో చూశాక తెలుస్తుందని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శ్రీ వాస్తవ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.