India Corona Cases : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

కరోనా కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే బుధవారం స్వల్పంగా పెరిగింది. నిన్న పదివేల పైచిలుకు కేసులు నమోదు కాగా.. బుధవారం కేసుల సంఖ్య 11 వేలు దాటింది.

India Corona Cases : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

India Covid

Updated On : November 10, 2021 / 12:11 PM IST

India Corona Cases : కరోనా కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే బుధవారం స్వల్పంగా పెరిగింది. నిన్న పదివేల పైచిలుకు కేసులు నమోదు కాగా.. బుధవారం కేసుల సంఖ్య 11 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,88,579కి చేరాయి. ఇందులో 1,39,683 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,37,87,047 మంది బాధితులు కోలుకున్నారు.

చదవండి : Corona : తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు, ఒకరు మృతి

4,61,849 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 11,961 మంది కరోనా నుంచి కోలుకోగా, 460 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కొత్త కేసుల్లో కేరళలోనే 6,409 కేసులు ఉండటం విశేషం. రాష్ట్రంలో మరో 47 మంది మరణించారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. మంగళవారం వరకు 109.63 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణి చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

చదవండి : Corona Virus: కరోనా వైరస్ ఆనవాళ్లు చెబితే.. రూ.11.5లక్షల బహుమతి ఇస్తామంటోన్న చైనా