Covid – 19 : అదుపులోకి వస్తున్న కరోనా.. నేడు 34 వేల కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.

Covid 19
Covid-19 : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు నమోదయ్యాయి. 375 మంది మరణించారు. మరణాలు మార్చి 30 నాటి స్థాయికి క్షిణించాయి. ఇక మొత్తం కేసుల్లో 3.23 మార్క్ దాటింది. మరణాలు 4.33లక్షలకు చేరింది. 24 గంటల్లో 36 వేల మంది కోవిద్ నుంచి బయటపడ్డారు. ఇక ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.15 కోట్లగా ఉంది.
అంటే ఇది 97.54 శాతం. ప్రస్తుతం 3,61,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో ఉన్నట్లు తెలుస్తుంది. దేశం మొత్తం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే కేరళలో 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.
కేరళలో రెండు డోస్ల టీకా తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు శుక్రవారం 36.36లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57,61,17,350గా ఉంది.