Yeddyurappa Corona : కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్పకు మరోసారి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Cm Bs Yeddyurappa Corona
Corona to Karnataka CM BS Yeddyurappa : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇవాళ ఉదయం ఆయనను రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చారు.
యడియూరప్పను మణిపాల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీనికి ముందు ఇవాళ ఉదయం యడియూరప్ప తన నివాసంలో కోవిడ్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది కూడా యడియూరప్ప కరోనా బారిన పడ్డారు.