Corona Virus : దేశవ్యాప్తంగా కొత్తగా 8,744 కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది.

Corona Virus : దేశవ్యాప్తంగా కొత్తగా 8,744 కరోనా కేసులు నమోదు

Corona Cases (2)

Updated On : November 28, 2021 / 11:35 AM IST

Corona Virus : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది. ఇందులో 3,39,98,278 మంది కరోనా నుంచి కోలుకోగా 1,05,691 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 4,68,554 మంది మహమ్మారి వల్ల మరణించారు. యాక్టివ్‌ కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

చదవండి : Corona New Variant: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్రమత్తం

ఇక గత 24 గంటల్లో మరో 9,481 మంది కరోనా నుంచి కోలుకోగా, 543 మంది మృతిచెందారని తెలిపింది. రాష్ట్రంలో శనివారం 4,741 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.34 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.31 శాతం మాత్రమేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ రాష్ట్రలో 4,741 కరోనా కేసులు నమోదయ్యాయి.

చదవండి : Corona New Variant: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్రమత్తం